రెండు సార్లు డకౌట్ ఆశీస్ పై విధ్వంసం
ప్రపంచకప్‌లో జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు.
ప్రపంచకప్‌లో జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఎన్నో అంచనాలతో టోర్నీలోకి అడుగుపెట్టిన జెమీమా, టోర్నమెంట్ తొలి నాలుగు మ్యాచుల్లో దారుణమైన ప్రదర్శన చేసింది. రెండు సార్లు డకౌట్ కావడం, మరో రెండు ఇన్నింగ్స్‌లలో 30 పరుగుల లోపు ఔట్ అవ్వడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో ఆమెను జట్టు నుండి తప్పించారు. ఇక జట్టులో పునరాగమనం చేసిన వెంటనే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగులతో అజేయంగా నిలిచి తన ఫామ్‌ను తిరిగి నిరూపించుకుంది. అదే నిబద్ధతతో సెమీస్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొని ఏకంగా 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత జట్టుకు విజయాన్ని అందించింది.