South Africa vs Australia : టెస్ట్ ఛాంపియన్ గా సౌతాఫ్రికా... ఆస్ట్రేలియాను ఓడించి మరీ
ఇరవై ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా ను ఓడించి టెస్ట్ ఛాంపియన్ గా సౌతాఫ్రికా విజయం సాధించింది
ఇరవై ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా ను ఓడించి టెస్ట్ ఛాంపియన్ గా సౌతాఫ్రికా విజయం సాధించింది. సెంచరీతో మారక్రమ్, బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో కెప్టెన్ బవుమా ఈ విజయానికి ప్రధాన కారణమయ్యారు. ఐదు వికెట్ల తేడాతో ఐసీపీ ప్రపంచ టెస్ట్ కప్పును గెలుచుకుంది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ గా సౌతాఫ్రికా నిలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ ను సౌతాఫ్రికా గెలుకుంది. 1998 తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సౌతాఫ్రికా అవతరించడంతో దాని ఆనందానికి అవధులు లేవు. లార్డ్స్ మైదానంలో సఫారీలు పండగ చేసుకున్నారు.
ఇద్దరూ విలువైన ఇన్నింగ్స్ ఆడి...
తొలి రెండు సీజన్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు విజేతగా నిలవగా, ఈసారి సౌతాఫ్రికా ఛాంపియన్ గా నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సఫారీలు ఏ మాత్రం తడబడలేదు. ఇందులో మార్క్ రమ్ 136 పరుగులు అతి విలువైనవి. ఒకరకంగా మార్క్ రమ్ జట్టు గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. తర్వాత డేవిడ్ బెడింగమ్ 21 పరుగులు, కెప్టెన్ బవుమా 66 పరుగులు చేయడంతో ఈ విజయం సాధ్యమయింది. దీంతో టెస్ట్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన సౌతాఫ్రికా ఆస్ట్రేలియాపై అన్ని విధాలుగా పై చేయి సాధించింది.
వన్డే తరహాలో జరిగిన...
టెస్ట్ క్రికెట్ అన్న మాటేగాని వన్డే తరహాలో మ్యాచ్ జరగుతుంది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్లో సౌతాఫ్రికా విజయం కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తుంది. ఊరిస్తున్న ట్రోఫీని సఫారీలు ఎట్టకేలకు ముద్దాడారు. ఆస్ట్రేలియాను రబడ నాలుగు, ఎంగిడి మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ వెన్ను విరిచారు. తర్వాత మార్క్ రమ్, బవుమాలు కలసి పని పూర్తి చేశారు. ఐసీసీ ట్రోఫీని ముద్దాడలన్న లక్ష్యాన్ని ఎట్టకేలకు సఫారీలు నెరవేర్చుకున్నారు. గెలుపు అటు ఇటు ఊగిసలాడినా చివరకు సౌతాఫ్రికా పరమైయింది