India vs South Africa First Odi : రివెంజ్ తీర్చుకుంటారా... కుర్రాళ్లపై అదే నమ్మకం.. కసి మాత్రం చాలా ఉంది

నేడు ఇండియా దక్షిణాఫ్రికాతో తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Update: 2023-12-17 03:09 GMT

IndiaVsSouthAfrica

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 మ్యాచ్ ల సిరీస్ టీం ఇండియా సమం చేసింది. మూడు మ్యాచ్‌లకు ఒక మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోగా, మరో రెండు మ్యాచ్‌లలో రెండు జట్లు విజయం సాధించడంతో సిరీస్ సమం అయ్యాయి. విదేశీ గడ్డపై దక్షిణాఫ్రికాను దాని సొంత మైదానంలో సిరీస్ ను సమం చేసిన టీం ఇండియా మరో సిరీస్ కోసం వెయిట్ చేస్తుంది. నేడు టీం ఇండియా దక్షిణాఫ్రికాతో తొలి వన్డే ఆడనుంది. జోహాన్స్ బర్గ్ లో జరిగే ఈ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు.

రాటుదేలి ఉన్న...
రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ దారుణమైన పరాభవాన్ని చవి చూసింది. సిరీస్ ను చేజార్చుకోవడమే కాకుండా ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేక తలవంచుకు తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు యువ జట్టు బాగా రాటు దేలి ఉంది. సరైనోళ్లు జట్టులో ఉన్నారు. పాత ప్లేయర్స్ సరిగా ఆడలేదని అనడం సరికాదు కానీ.. ఇప్పుడు మనోళ్లు మంచి ఫామ్ లో ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్స్ లోకి అడుగుపెట్టడమే అందుకు నిదర్శనం. ఫైనల్స్ లో ఓడిపోవడం కొంత దురదృష్టకరమైనప్పటికీ మనోళ్లు ఆడిన తీరును మాత్రం ప్రశంసించకుండా ఉండలేం.
తుది జట్టు ఇదే...
ఈరోజు కూడా యువ ఆటగాళ్లతో జట్టు ఊగిపోతుంది. సీనియర్లకు విశ్రాంతి నివ్వడంతో యువ ఆటగాళ్లు తమ ప్రతిభను కనపర్చుకోవడానికి ఇదే సరైన సమయం. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లిలు ఈ మ్యాచ్ లకు దూరంగా ఉన్నారు. కొత్తోళ్లకు అవకాశమిచ్చి ప్రయోగం చేయాలని కూడా సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీతో పాటు వికెట్ కీపర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. బహుశా టీం ఇండియా తొలి వన్డేలో వీళ్లు ఆడే అవకాశముంది. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ముఖేశ్ కుమార్‌లు ఆడే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News