IPL 2025 : నేడు గుజరాత్ vs లక్నో

నేడు ఐపీఎల్ లో . గుజరాత్ టైటాన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.

Update: 2025-05-22 03:00 GMT

ఐపీఎల్ లో ప్లేఆఫ్ కు చేరే జట్లపై క్లారిటీ వచ్చింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్, ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసుకు చేరుకున్నాయి. మిగిలిన ఆరు జట్లు ఇంటి దారి పట్టినట్లే. ఇకపై ఏ ప్లే ఆఫ్ లో ఉన్న జట్లు తప్పించి మిగిలిన జట్లు ఆడే మ్యాచ్ లన్నీ నామామాత్రమే. ఎందుకంటే అవి గెలిచినా ప్రయోజనం లేదు. ఓడినా ఫలితంలేదు. అందుకే ప్లే ఆఫ్ రేసుకు చేరుకున్న జట్లు ఖరారు కావడంతో ఇక ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది.

నామమాత్రపు మ్యాచ్...
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే పద్దెనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ప్లే ఆఫ్ లో చోటును కన్ఫర్మ్ చేసుకుంది. ఇక కోల్ కత్తా నైట్ రైడర్స్ పదమూడు మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లలో ఓడి, ఆరు మ్యాచ్ లలో గెలిచి పన్నెండు పాయింట్లతో ఉంది. ఇది గెలిచినా ఏమీ కాదు.


Tags:    

Similar News