దుబాయ్ స్టేడియంలో చిరంజీవి
నిన్న దుబాయ్ లో జరిగిన ఇండియా - పాక్ మ్యాచ్ చూడటం కోసం వేలాది మంది తరలి వెళ్లారు.
నిన్న దుబాయ్ లో జరిగిన ఇండియా - పాక్ మ్యాచ్ చూడటం కోసం వేలాది మంది తరలి వెళ్లారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వెళ్లి దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూశారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్ లు స్టేడియంలో కనిపించారు. సాధారణంగా వెంకటేశ్ తరచూ క్రికెట్ స్టేడియంలో కనిపిస్తారు. చిరంజీవి ఎప్పుడూ పెద్దగా క్రికెట్ స్టేడియంలో కనిపించరు.
మెగా మ్యాచ్ ను...
అలాంటిది ఈ మెగా మ్యాచ్ ను చూసేందుకు చిరంజీవి రావడంతో అక్కడకు వచ్చిన ప్రేక్షకులు చిరంజీవిని చూసి కేరింతలు కొట్టారు. చిరంజీవి పక్కనే క్రికెటర్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా కూర్చుని ఉండటం కనిపించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో పాక్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్ ను తిలకించేందుకు ఏపీ మంత్రి నారా లోకేశ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా వెళ్లారు.