Asia Cup : ఆసియా కప్ లో పాక్ సంచలన నిర్ణయం?
ఆసియా కప్ లో సంచలనం చోటు చేసుకుంది. ఆసియా కప్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు సమాచారం.
ఆసియా కప్ లో సంచలనం చోటు చేసుకుంది. ఆసియా కప్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈరోజు యూఏఈతో జరగనున్న మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించే అవకాశముంది.. హోటల్ నుంచి ఇప్టపి వరకూ పాకిస్తాన్ టీం బయటకు రాలేదు. దీంతో ఆసియా కప్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు కనపడుతుంది.
భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా...
భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా గత ఆదివారం మ్యాచ్ పూర్తయిన తర్వాత షేక్ హ్యాండ్ వివాదంతో పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు రిఫరీపై చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరింది. లేకపోతే బహిష్కరిస్తామని తెలిపింది. కానీ ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆసియాకప్ ను బహిష్కరించేందుకే నిర్ణయం తీసుకుందన్న వార్తలు వెలువడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.