India Vs England Fith Test : ఉత్కంఠగా మారి ఐదో టెస్ట్.. ఏది జరిగినా ఆశ్చర్యం లేదు
ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవల్ లో జరుగుతున్న ఐదోటెస్ట్ మ్యాచ్ లో విజయం పై ఇంకా ఉత్కంఠ నెలకొంది.
ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవల్ లో జరుగుతున్న ఐదోటెస్ట్ మ్యాచ్ లో విజయం పై ఇంకా ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిదైనా కావచ్చు. ఇటు భారత్ కు గెలుపు అవకాశాలున్నాయి. మరొక వైపు ఇంగ్లండ్ కు గెలుపునకు మంచి ఛాన్స్ ఉంది. అందుకే ఈరోజు చివరి రోజు కావడంతో పాటు వికెట్లతో పాటు గెలవడానికి అవసరమైన పరుగులు తక్కువగా ఉండటంతో ఎవరిది గెలుపు అన్నది ఉత్కంఠగా మారింది. గెలవాలంటే చివరిరోజు టీం ఇండియా నాలుగు వికెట్లు పడగొట్టాల్సి ఉండగా, ఇంగ్లండ్ గెలవాలంటే కేవలం 35 పరుగులు మాత్రమే చాలు. కానీ రెండింటిలో ఏదైనా జరగొచ్చు. కానీ ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు మాత్రం లేవు. అందుకే నేడు గెలుపు ఎవరిదన్నది డిసైడ్ కానున్నది
ఓటమి ఖాయమనుకున్న దశలో...
నిన్న మ్యాచ్ చూసిన వారికి భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ చివర్లో పుంజుకున్నభారత్ బౌలర్లు చకా చకా వికెట్లు తీయడంతో ఇప్పుడు పోటీ రసవత్తరంగా మారింది. అయితే చివరి టెస్ట్ లో రెండు జట్లు వత్తిడిలోనే ఉన్నాయి. భారత్ గెలిస్తే ఈ సిరీస్ సమం అవుతుంది. ఇంగ్లండ్ గెలిస్తే 3 -1 తో సిరీస్ ను ఇంగ్లండ్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. మరి ఏం జరుగుతుందన్నది ఈరోజు తేలనుంది. 374 పరుగుల లక్ష్యాన్ని అధిగమించాల్సిన ఇంగ్లండ్ నింపాదిగా ఆడుతూ మంచి స్కోరు చేసింది. చివరకు ఆరు వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. బ్రూక్ 111, రూట్ 105 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ విజయావకాశాలకు దగ్గరగా వచ్చింది.
వర్షం కారణంగా...
అయితే వర్షం కారణంగా ఆట ముందే నిలిచిపోవడంతో్ నేటికి క్లైమాక్స్ కు వాయిదా పడింది. మరో 3.4 ఓవర్లు వేస్తే భారత్ కు కొత్త బంతి లభిస్తుంది. అది భారత్ కు కలసి వస్తుందంటున్నారు. వోక్స్ బ్యాటింగ్ కు దిగడం సందేహమే అయితే ఇంగ్లండ్ చేతిలో ఉన్నది మూడు వికెట్లు మాత్రమే. ఇంగ్లండ్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. భారత్ బౌలర్లలో ఆకాశ్ దీప్ ఒకటి, ప్రసిద్ధ్ కృష్ణ మూడు, సిరాస్ రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ను విజయవంతంగా ఒత్తిడిలోకి నెట్టగలిగారు. ఈరోజు ఇంగ్లండ్ తక్కువ పరుగులు చేయాల్సి రావడం, భారత్ కు తక్కువ వికెట్లు దొరకబుచ్చుకోవడం వంటి అంశాలు మ్యాచ్ లో ఉత్కంఠను రేపాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.