Asia Cup : భారత్ -పాక్ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ.. గెలుపు అవకాశాలు ఎవరికంటే?

ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు మరో రోజు మాత్రమే సమయం ఉంది.

Update: 2025-09-13 04:37 GMT

ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు మరో రోజు మాత్రమే సమయం ఉంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతుంది. గంటలు మాత్రమే సమయం ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. భారత్ - పాక్ మ్యాచ్ అంటే చెవులు, కళ్లు రిక్కించుకుని మరీ టీవీల ముందు ఉంటారు. రెండు దేశాల్లోనూ క్రికెట్ అభిమానుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వికెట్ పడినా.. ఫోర్ బాదినా.. సిక్సర్ కొట్టినా... క్యాచ్ పట్టినా చూడాలి... కేరింతలు.. విజిల్స్ తో పాటు ఊగిపోయేంత అభిమానులు ఈ మ్యాచ్ కు ఉన్నారు. అందుకే ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ మరే మ్యాచ్ కు ఉండదు.

రెండు జట్లు మైదానంలో...
రెండు జట్లు మైదానంలో తలపడితే సరిహద్దుల్లో యుద్ధానికి సిద్ధమయినట్లే ఉంటున్న ఫీలింగ్ క్రికెట్ ఫ్యాన్స్ లో ఉంటుంది. అందుకే గెలుపోటముల గురించి భారత్ - పాకిస్తాన్ లో ఉన్న క్రికెట్ అభిమానులు అంతా భావోద్వేగాల మధ్య కూర్చుని ఉంటారు. గెలిచిన వారిలో ఉత్సాహం ఎంత ఉంటుందో.. ఓడిపోతే అంత నీరసం కూడా అభిమానుల్లో ఉండటం ఈ మ్యాచ్ ప్రత్యేకత. ఇక టీవీలో టీఆర్పీ రేటింగ్స్ కు కూడా భారత్ - పాక్ మ్యాచ్ కే ఎక్కువ ఉంటుంది. అందుకే రెండు దేశాలు తలపడితే మరో జల్లికట్టు సమరంలా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకూ భారత్ - పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే.. ఎవరిది పై చేయి అన్నది కూడా గణాంకాలు కొంత స్పష్టం చేస్తున్నాయి.
భారత్ దే ఆధిపత్యం...
అయితే గతంలో ఉన్న గణాంకాల ప్రకారం ఈ మ్యాచ్ ఫలితం ఉండకపోయినా.. రెండు జట్ల బలాలు, బలహీనతలపై మాత్రం రెండు దేశాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. టీ 20 ఫార్మాట్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా ఉంది. ఐపీఎల్ లో ఆడి రాటుదేలి ఉండటంతో పాటు యువ ఆటగాళ్లు రెచ్చిపోయే అవకాశముంది. టీం ఇండియా టీ20 లలో వరల్డ్ ఛాంపియన్ గా ఉండగా, పాకిస్తాన్ మాత్రం ఎనిమిదో స్థానంలోనే ఉంది. అయితే మైదానంలో వత్తిడిని బట్టి గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.ఆసియా కప్ కానీ, టీ 20 ప్రపంచ కప్ కాని, వన్డే ప్రపంచ కప్ కానీ భారత్ దే పైచేయి. మొత్తం పదహారు మ్యాచ్ లు ఈ ఫార్మాట్ లో జరగగా అత్యధికంగా భారనత్ ఎనిమిది సార్లు గెలవగా, పాకిస్తాన్ రెండు సార్లు మాత్రమే గెలిచింది. శ్రీలంక ఆరు సార్లు గెలిచింది. అయితే భారత్ - పాక్ లు ఫైనల్స్ లో ఒక్కసారి కూడా తలపడకపోవడం విశేషం. మరి ఈసారి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News