Asia Cup : యువర్ అటెన్షన్ ప్లీజ్... భారత్ - పాక్ బలాలు.. బలహీనతలు ఏంటంటే?

ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు ఇంకా కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. దుబాయ్ లో జరగనున్న ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది

Update: 2025-09-14 04:14 GMT

ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు ఇంకా కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. దుబాయ్ లో జరగనున్న ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఎవరి బలాలు ఎలా ఉన్నాయి? ఎవరి బలహీనతలు ఏంటి? అన్న దానిపై క్రికెట్ అభిమానుల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. భారత్ - పాక్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. సరిహద్దుల్లో ఉండే టెన్షన్ మైదానంలోనూ కనిపిస్తుంది. ఆ ఒత్తిడి నుంచి ఏ జట్టు బయటపడి ఆట ఆడుతుందో వారిదే గెలుపు. అయితే రెండు జట్లు బలమైనవే. కాకుంటే గత మ్యాచ్ ల గణాంకాలు మాత్రం భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

ముగ్గురు స్పిన్నర్లతో...
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు యావత్ క్రికెట్ అభిమానులు అటెన్షన్ తో ఉంటారు. అయితే దుబాయ్ లో జరుగుతుండటంతో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకూ రెండు జట్లు చెరొక మ్యాచ్ ను సాధించారు. రెండు జట్లు పసికూన యూఏఈపైనే విజయం సాధించాయి. రెండు జట్లు స్పిన్నర్లతోనే సమరంలోకి దిగుతున్నాయి. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో మంచి ఊపు మీదుంది. కులదీప్ యాదవ్ తన బౌలింగ్ తో బ్యాటర్లకు చుక్కలు చూపుతాడు. వరుణ్ చక్రవర్తి సరైన సమయంలో వికెట్ తీసుకుని జట్టుకు బలంగా మారతాడు. ఇక అక్షర్ పటేల్ కేవలం స్పిన్ బౌలింగ్ తో మాత్రమే కాదు ఆల్ రౌండర్ గా కూడా ప్రతిభ చూపే సత్తాగల ఆటగాడు. వీరు ముగ్గురు చెలరేగిపోతే పాక్ యువ ఆటగాళ్లు ఎలా తట్టుకుంటారో చూడాలి.
పాక్ లో కూడా నలుగురు...
పాకిస్తాన్ కూడా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. మహ్మద్ నవాజ్ కీలక సమయంలో వికెట్లు దొరకబుచ్చుకుని ప్రత్యర్థిని చిత్తు చేయగలడు. అలాగే అబ్రార్ అహ్మద్ కూడా తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. వికెట్లు వీలయినంత వరకూ దొరకబుచ్చుకుంటాడు. సుఫియాన్ ముకీమ్, సయామ్ ఆయూబ్ కూడా స్పిన్ తో బ్యాటర్లను కట్టడి చేయగలడు. అయితే భారత్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొని నిలబడగలగాలి. ఆ సత్తా భారత్ బ్యాటర్లకు ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. భారత్ లో కూడా యువ ఆటగాళ్లు ఉండటంతో స్పిన్ కు ఎవరు నిలబడతారో...ఎవరు సమర్పించుకుంటారో చూడాలి. మొత్తం మీద టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News