IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడంటే?

ఐపీఎల్ 18వ సీజన్ లో అర్ధాంతరంగా నిలిచిపోయిన మ్యాచ్ లు మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2025-05-11 06:56 GMT

ఐపీఎల్ 18వ సీజన్ లో అర్ధాంతరంగా నిలిచిపోయిన మ్యాచ్ లు మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతోపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, రేపు ఇరుదేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య చర్చలు కూడా జరగనున్న నేపథ్యంలో ఆగిపోయిన మ్యాచ్ లు తిరిగి మొదలయ్యే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ.. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అనుమతి వస్తేనే?
అయితే మ్యాచ్ లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అందుతున్న సమాచారం మేరకు మే 15వ తేదీ నుంచి మొదలవుతాయని ప్రాధమికంగా అందుతున్న సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటన ఏదీ రాకపోయినప్పటికీమిగిలిపోయిన మ్యాచ్ లు జరిపి సీజన్ ను ముగించేయాలని బీసీసీఐ భావిస్తుంది. ఇప్పటి వరకూ యాభై ఏడు మ్యాచ్ లు జరిగాయి. మరో పదహారు మ్యాచ్ లను నిర్వహించాల్సి ఉంది. ప్లేఆఫ్ రేసు ప్రారంభమయ్యే సమయానికి పాక్ - ఇండియాల సరిహద్దుల మధ్య టెన్షన్ వాతావరణంతో వాయిదా వేసింది
పది రోజుల్లో పదహారు మ్యాచ్ లు?
. ధర్మశాలలో ఢిల్లీ కాపిటల్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను కూడా మధ్యలోనే నిలిపేశారు. దీనిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండు జట్లకు చెరో పాయింట్ ఇస్తారా? లేదా మళ్లీ మ్యాచ్ ను జరుపుతారా? అన్నది నిర్ణయించాల్సి ఉంది. మరొకవైపు ఈ నెల 25వ తేదీన ఫైనల్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు అయితే పదహారు మ్యాచ్ లు జరగనుండటంతో ఇంత తక్కువ సమయం సరిపోతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈరోజు, రేపట్లో ఐపీఎల్ 18 సీజన్ తిరిగి ప్రారంభంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఈ ప్రకటన కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News