జెర్సీ నెంబర్ AK 47 వచ్చేశాడు.. ఎలాంటి ప్రదర్శన చేస్తాడో?

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తరఫున కొత్త ప్లేయర్ అరంగేట్రం చేశాడు.

Update: 2025-05-24 10:15 GMT

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తరఫున కొత్త ప్లేయర్ అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టిన అన్షుల్ కాంబోజ్ టీమిండియాలోకి ప్రవేశించాడు. అన్షుల్ కాంబోజ్ దేశవాళీ క్రికెట్ లో మంచి బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో కేరళపై ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు రంజీలో 6 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు సాధించాడు. భారత్ ఏ జట్టు తరఫున ఇటీవల ఇంగ్లాండ్ టూర్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. జూన్ 6 నుంచి 9 వరకు జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులతో అజేయంగా నిలిచి బ్యాటింగ్ తోనూ ఆకట్టుకున్నాడు. ఇక అతడి జెర్సీ నెంబర్ మీద కూడా చర్చ జరిగింది. AK 47 అంటూ బరిలోకి దిగిన అన్షుల్ కాంబోజ్ అంతర్జాతీయ కెరీర్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News