పంత్ కు షాకిచ్చిన ఐసీసీ

ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టిన రిషబ్ పంత్ కు ఐసీసీ షాకిచ్చింది.

Update: 2025-06-24 09:45 GMT

ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టిన రిషబ్ పంత్ కు ఐసీసీ షాకిచ్చింది. హెడింగ్లీ టెస్టు మూడో రోజు ఆటలో అంపైర్ తో గొడవ వల్ల పంత్ కు శిక్ష విధించింది ఐసీసీ. బాల్ షేప్ గురించి అంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని మార్చాలని అంపైర్ తో గొడవకు దిగి బంతిని నేలకేసి కొట్టాడు.

ఈ వివాదం కారణంగా రిషబ్ పంత్ కు ఐసీసీ ఫైన్ విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకు అతన్ని ఐసీసీ మందలించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ను భారత వైస్ కెప్టెన్ ఉల్లంఘించినట్లు తేలింది. అతనికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. గత 24 నెలల్లో అతను చేసిన తొలి తప్పు ఇదే కాబట్టి ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చారు.

Tags:    

Similar News