అమ్మాయిలు కప్ అందుకోవాలి!!

ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసింది. ఇక క్రికెట్ ప్రియులను అలరించడానికి మహిళల ప్రపంచకప్ కు సమయం దగ్గర పడింది.

Update: 2025-09-30 13:00 GMT

ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసింది. ఇక క్రికెట్ ప్రియులను అలరించడానికి మహిళల ప్రపంచకప్ కు సమయం దగ్గర పడింది. సెప్టెంబర్‌ 30న మహిళల క్రికెట్‌ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. నవంబర్‌ 2 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పాల్గొంటున్నాయి. 5 వేదికలపై 34 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీలో భాగంగా గువాహటిలో తొలి మ్యాచ్ భార‌త్, శ్రీలంక మ‌ధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News