వేలంలో తెలుగు క్రికెటర్ల సత్తా
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో తెలుగు క్రికెటర్లు సత్తాచాటారు. అరుంధతిరెడ్డిని ఆర్‌సీబీ 75 లక్షలకు తీసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో తెలుగు క్రికెటర్లు సత్తాచాటారు. అరుంధతిరెడ్డిని ఆర్‌సీబీ 75 లక్షలకు తీసుకుంది. త్రిష ను యూపీ, క్రాంతిరెడ్డి ముంబై, మమత ఢిల్లీ జట్టు సొంతం చేసుకున్నాయి. పది లక్షల చొప్పున ఈ ఫ్రాంచైజీలు వారిని సొంతం చేసుకున్నాయి. అండర్–19 వరల్డ్ కప్ విజయంలో భాగమైన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో అవకాశం లభించడం విశేషం. శ్రీచరణి 1.3 కోట్లతో జాక్‌పాట్ కొట్టింది. శ్రీచరణి 30 లక్షల కనీస ధరతో వేలంలోకి ప్రవేశించింది. తొలుత ఢిల్లీ, ముంబై, యూపీ పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ సొంతం చేసుకుంది. గత మూడు సీజన్లు ఢిల్లీకి ఆడిన అరుంధతిరెడ్డిని ఆర్‌సీబీ 75లక్షలకు తీసుకుంది.