చారిత్రాత్మక విజయాన్ని సాధించిన మహిళల జట్టు

భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం నమోదు చేసింది.

Update: 2023-12-24 10:14 GMT

INDWvsAUSW cricketmatch

భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మహిళల టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియాపై భారత్ కు ఇదే తొలి విజయం. 1977 నుంచి భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య 10 టెస్టులు జరగ్గా... అందులో 4 మ్యాచ్ ల్లో ఓడిపోయిన భారత్ 6 టెస్టులను డ్రా చేసుకుంది. 11వ మ్యాచ్ లో టీమిండియాకు తొలి విజయం దక్కింది.

ముంబయిలో జరిగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా మొదట ఇన్నింగ్స్ లో 219 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4, స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లతో సత్తా చాటారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు షెఫాలీ వర్మ (40), స్మృతి మంథన (74), రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73, దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో రాణించడంతో 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 261 పరుగులకు కుప్పకూలింది. స్నేహ్ రాణా 4, రాజేశ్వరి గైక్వాడ్ 2, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 2 వికెట్లు తీశారు. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంథన (38 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (12 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.



Tags:    

Similar News