మొహాలీలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్

ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం

Update: 2023-09-22 17:44 GMT

ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు శుభ్ మాన్ గిల్ (74), రుతురాజ్ గైక్వాడ్ (71) తొలి వికెట్ కు 142 పరుగులు జోడించి భారత్ కు శుభారంభం అందించారు. శ్రేయాస్ అయ్యర్ (3) విఫలం కాగా, ఇషాన్ కిషన్ 18 పరుగులు చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 2, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 1, షాన్ అబ్బాట్ 1 వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. మొహమ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ తో మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ (4) ను అవుట్ చేసిన షమీ, స్టీవ్ స్మిత్ ను అద్భుతమైన బంతితో పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ (29), మాథ్యూ షార్ట్ (2), షాన్ అబ్బాట్ (2) షమీ బౌలింగ్ లో వెనుతిరిగారు. వార్నర్ 52, స్టీవ్ స్మిత్ 41, లబుషేన్ 39, కామెరాన్ గ్రీన్ 31, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 45 రాణించారు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేరుకుంది. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 24న ఇండోర్ లో జరగనుంది.


Tags:    

Similar News