Asia Cup : నేడు ఆసియా కప్ లో భారత్ తొలి పోరు
ఆసియా కప్ లో నేడు టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా యూఏఈతో మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ లో నేడు టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా యూఏఈతో మ్యాచ్ జరగనుంది. రాత్రి ఎనిమిది గంటల నుంచి బ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్ గ్రూప్ ఎలో భాగమైన యూఏఈతో తతలపడుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ ఛాంపియన్ షిప్ ట్రోఫీలో టీం ఇండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ వార్మప్ మ్యాచ్ గా భావిస్తున్నప్పటికీ యూఏఈపై రికార్డులను అధిగమించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇది టీ20 మ్యాచ్ లు కావడంతో ఏ జట్టును తక్కువగా అంచనా వేయకూడదు.
యూఏఈతో ఆడుతున్నా...
అదే సమయంలో భారత సంతతికి చెందిన వారు కూడా ప్రత్యర్థి జట్లలో ఉండటం కొంత అననకూలత అంశం. ఇటీవల బంగ్లాదేశ్ పై టీ 20 సిరీస్ ను గెలుచుకున్న యూఏఈ జట్టు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తుంది. అందుకే ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. ప్రయోగాలు చేయడానికి కూడా సరైన వేదిక కాదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. సమఉజ్జీతో పోటీ పడుతున్నట్లే బరిలోకి దిగాలని మైదానంలో అనువైన సమయంలో రెచ్చిపోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం దుబాయ్ పిచ్ అత్యధిక పరుగులు సాధించే పిచ్ అని చెబుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసే వాళ్లకు కొంత పిచ్ అనుకూలించకపోవచ్చని అంటున్నారు. అందుకే టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి.