India Vs Westindies : పూర్తి ఆధిక్యతలో భారత్.. వెస్టిండీస్ ను ఓడించాలంటే?

అహ్మదాబాద్ లో జరుగుతున్న భారత్ - వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా పట్టుబిగిస్తుంది.

Update: 2025-10-04 01:43 GMT

అహ్మదాబాద్ లో జరుగుతున్న భారత్ - వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా పట్టుబిగిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 286 పరుగుల ఆధిక్యతతో నిలిచింది. కేవలం ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు సెంచరీలు చేశారు. అంటే ఒకరోజులోనే ముగ్గురు భారత ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. దీంతో వెస్టిండీస్ జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని భారత్ చాటుకున్నట్లయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా 128 ఓవర్లు ఆడి ఐదు వికెట్లను కోల్పోయి 448 పరుగులను చేయగలిగింది.

ఇంకా ఐదు వికెట్లు...
కేఎల్ రాహుల్ సెంచరీ చేసి అవుటయ్యారు. ధ్రువ్ జురెల్ 125 పరుగుల చేసి వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ధ్రువ్ జురెల్, జడేజాతో కలసి మంచి ఇన్నింగ్స్ ను నిర్మించారు. గుడ్ పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పారు. 206 పరుగుల భాగస్వామ్యం ఈ ఇద్దరు నెలకొల్పడంతోనే ఇంతటి భారీ స్కోరు సాధ్యమయిందంటున్నారు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు. మరో ఐదు వికెట్లు భారత్ చేతిలో ఉన్నాయి. దాదాపు ఆరువందల స్కోరు చేసిన తర్వాత ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశముందని అంటున్నారు.
వెస్టిండీస్ వైఫ్యల్యం...
తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ తక్కువ పరుగులకే అవుటయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ తీసుకుంది. అదే భారత్ కు వరంగా మారింది. భారత బౌలర్ల చేతిలో వెస్టిండీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. దీంతో 44.1 ఓవర్లకే 162 పరుగులు చేసి వెస్టిండీస్ ఆల్ అవుట్ అయింది. ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకుండా మహ్మద్ సిరాజ్, జస్పిత్ బుమ్రాలు బంతితో ఒక ఆటాడుకున్నారు. ఇప్పుడు భారత్ బ్యాటర్లు బ్యాట్ తో రఫ్ఫాడిస్తున్నారు. ఇదే జరిగితే తొలి టెస్ట్ మ్యాచ్ ను వెస్టిండీస్ పైగెలచి భారత్ ఆధిక్యంలోకి వచ్చే అవకాశముందని అనేక మంది క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి మూడో రోజు మనోళ్లు ఎలా ఆడతారన్నది చూడాలి.


Tags:    

Similar News