India Vs England Fourth Test : తక్కువ పరుగులకే టీం ఇండియా ఆల్ అవుట్... ఇలాగయితే?
భారత్ - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తక్కువ పరుగులకే టీం ఇండియా ఆల్ అవుట్ అయింది
భారత్ - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆల్ అవుట్ అయింది. 358 పరుగులకు తన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. 264 పరుగులను తొలి రోజు చేసిన భారత జట్టు నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయింది. అయితే రెండో రోజు మాత్రం ఆట మొదలు పెట్టిన తర్వాత 94 పరుగులు జోడించి చివరి ఆఖరి ఆరు వికెట్లను కోల్పోయింది. అంటే ఎప్పటిలాగానే చివర్లో వచ్చిన టీం ఇండియా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో ఇంగ్లండ్ ముందు పెద్ద లక్ష్యాన్ని మాత్రం పెట్టలేకపోయింది. అంటే ఆట తీరు మారలేదన్న విషయం స్పష్టమవుతుంది. చివరలో వచ్చిన ఆటగాళ్లు ఎవరూ క్రీజులో నిలబడలేకపోవడంతోనే తక్కువ పరుగులకే ఆల్ అవుట్ కావాల్సి వచ్చింది.
94 పరుగలకే ఆరు వికెట్లు...
తొలి రోజు కాలికి గాయమవ్వడంతో రిటైర్డ్ హర్ట్ గా వైదొలిగిన రిషబ్ పంత్ నిన్న మైదానంలోకి రావడంతో పాటు 54 పరుగులు చేయడం వల్లనే ఆమాత్రం స్కోరు లభించింది. లేకుంటే అది కూడా వచ్చేది కాదు. శార్దూల్ ఠాకూర్ కూడా 41 పరుగులు చేసి పరవాలేదనిపించినా, రవీంద్ర జడేజా ఇరవై పరుగులు, వాషింగ్టన్ సుందర్ ఇరవై ఏడు పరుగులు, మాత్రమే చేశారు. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు, వోక్స్, లియామ్ డాసన్ లు చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో 358 పరగులు మాత్రమే భారత్ చేసి తక్కవ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. తర్వాత ఆట మొదలు పెట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు తమ జోరును కొనసాగిస్తుున్నారు. అయితే ఇప్పడు ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత భారత్ బౌలర్లపైనే ఉంది.
దూకుడు మీద ఇంగ్లండ్...
అయితే ఇంగ్లండ్ బౌలర్లు నిలదొక్కుకుని ఆటను తమ బైపునకు తిప్పుకుంటున్నారు. ఇంగ్లండ్ ను ఆపడం ఇక కష్టమే. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన మొదటి రోజునే 264 పరుగులు చేసి నాలుగు వికెట్లు చేసింది. ఓపెనర్లు డకెట్ 94 పరుగులు, క్రాలీ 84 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ అత్యధిక స్కోరు దిశగా దూసుకుపోతుంది. ఇంకా 133 పరుగులే భారత్ కంటే వెనుకబడి ఉంది. ఈరోజు దానిని అధిగమంచి జోరు మీదున్న ఇంగ్లండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని విధించే అవకాశముంది. భారత్ బౌలర్లు తొలి వికెట్ కోసం అవస్థలు పడ్డారు. ఇంగ్లండ్ బ్యాటర్లు బ్యాటుతో బంతిని అవలీలగా మైదానం అవతలి వైపునకు తరలించి భారత్ కు పెద్ద లక్ష్యమే పెట్టేటట్లున్నారు. భారత్ కు ఈమ్యాచ్ సవాల్ గా మారనుంది.