Ind vs Eng Second Test : బౌలర్లు చేయి తిరిగితే ఇక భారత్ దే పై చేయి
భారత్ - ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో రోజు కూడా టీం ఇండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనపర్చారు.
భారత్ - ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో రోజు కూడా టీం ఇండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనపర్చారు. తొలి రోజు ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసిన భారత్ రెండో రోజు 587 పరుగులు చేసి ఆల్ అవుటయింది. ఇక కెప్టెన్ శుభమన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శుభమన్ గిల్ 269 పరుగులు చేశఆడు. గిల్ 387 బంతులను ఎదుర్కొని ముప్ఫయి ఫోర్లు, మూడు సిక్సర్లతో డబుల్ సెంచరీని సాధించడంతో భఆరత భారీ స్కోరును సాధించింది.
నిలకడగా రాణించి...
భారత్ రెండో రోజు కూడా నిలకడగా రాణించడంతో ఇక ఇంగ్లండ్ బ్యాటర్ల పనిపట్టాల్సిన పని బౌలర్లపైనే ఉంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం కావడంతో బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ అనువైన సమయంలో వికెట్ తీయగలిగితేనే భారత్ కు విజయావకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. భారత్ కంటే ఇంగ్లండ్ ఇంకా 510 పరుగుల వెనకబడి ఉంది.
మూడో రోజు ఆటలో...
ఆకాశ్ దీప్ వరసగా రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ తీయడంతో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. శుభమన్ గిల్ ట్రిపుల్ సెంచరీని చేజార్చుకున్నట్లయింది. 269 పరుగులు చేసిన గిల్ మరో 31 పరుగులు చేసి ఉంటే ట్రిపుల్ సెంచరీ పూర్తయ్యేది. కానీ గిల్ అవుట్ కావడం ఒకరకంగా బ్యాడ్ లక్. భారత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ 42 పరుగులు చేశాడు. ఈరోజు భారత్ బౌలర్లు చేయి తిరిగితే మాత్రం ఈ మ్యాచ్ మనవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అందుకు బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా శ్రమించాల్సి ఉంది.