అహ్మదాబాద్ లో రెచ్చిపోయిన భారత బౌలర్లు
భారత్ జట్టు వెస్టిండీస్ పై తొలిరోజు ఆధిపత్యం దిశగా వెళుతుంది.
భారత్ జట్టు వెస్టిండీస్ పై తొలిరోజు ఆధిపత్యం దిశగా వెళుతుంది. వెస్టిండీస్ లంచ్ బ్రేక్ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి తొంభయి పరుగులు మాత్రమే చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు తడబడుతుంది.
టాప్ ఆర్డర్ కుప్పకూలి...
భారత బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్ప కూలింది. 23.2 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి తొంభయి పరుగులు మాత్రమే చేసింది. టీం ఇండియా బౌలర్లలో హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ అత్యధిక వికెట్లు తీశాడు. మూడు వికెట్లు తీసిన సిరాజ్ వెస్టిండీస్ బ్యాటర్లపై వత్తిడి పెంచాడు. కేవలం ఏడు ఓవర్లు వేసిన సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. కులదీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు.