Women World Cup : జట్టు ఏదైనా భారత్ దే జయం.. మహిళల ప్రపంచకప్ లోనూ పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం

మహిళల ప్రపంచ కప్ లో టీం ఇండియా పాకిస్తాన్ ఓడించింది.

Update: 2025-10-06 01:44 GMT

మహిళల ప్రపంచ కప్ లో భారత్ సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ - భారత్ మ్యాచ్ ఏదైనా సరే అది ఉత్కంఠ రేపుతుంది. మహిళల ప్రపంచ కప్ లో టీం ఇండియా పాకిస్తాన్ ఓడించింది. మహిళల ప్రపంచ కప్ లో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ పై ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో భారత్ గెలిచింది. మహిళల ప్రపంచ కప్ లో టీం ఇండియా ఇప్పటికే నాలుగు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు ప్రారంభంలో తడబడింది. భారత్ యాభై ఓవర్లకు గాను 247 పరుగులు చేసింది.

భారత్ తొలుత తడబడినా...
తొలుత వికెట్లు వెంటవెంటనే పడిపోయినా హర్లీస్ డియోల్, స్మృతి మంధన, దీప్తి శర్మలు నిలిచి ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. హర్లీన్ డియోన్ 46 పరుగులు, స్మృతి మందన 35పరుగులు, దీప్తి శర్మ 29 పరుగులు చేయడంతో భారత్ 247 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆఖరి ఓవర్లలో స్నేహ్ రాణా, రిచాఘోష్ లు అత్యంత వేగంగా పరుగులు సాధించడంతోనే ఈ విజయం సాధ్యమయంది. హర్లీన్ డియోల్ సూపర్ ఇన్నింగ్స్ కారణంగానే ఈ మాత్రం స్కోరు అయినా టీం ఇండియాకు లభించింది. పాక్ బౌలర్లలో నిదాదార్ రెండు, ఫానిమా నవా, నదియా ఇక్బాల్ తలో వికెట్ తీశారు.
బౌలర్ల ధాటికి పాక్...
అనంతరం 247 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ కొంత ఒత్తిడిని ఎదుర్కొనింది. పాక్ బ్యాటర్లలో ఒక్కసిద్రా అమీన్ మాత్రమే 81 పరుగులు చేసి పాకిస్తాన్ ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే మిగిలిన పాక్ బ్యాటర్లు సిద్రాకు సహకరించలేదు. భారత బౌలర్ల చేతిలో వరసగా అవుట్ అయ్యారు. పాకిస్తాన్ కేవలం 43 ఓవర్లలో మాత్రమే 159 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో భారత్ 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై గెలిచింది. భారత్ బౌలర్లలో క్రాంతి గౌర్, దీప్తి శర్మ తలో మూడు వికెట్లు తీయగా, స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. మహిళల ప్రపంచ కప్ లోనూ పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించి తిరుగులేదనిపించుకుందేి.



















Tags:    

Similar News