రాజ్ కోట్ లో టీం ఇండియా గెలుస్తుందా?

రాజ్ కోట్ వన్డేలో టీం ఇండియా భారీ పరుగులు సాధించింది.

Update: 2026-01-14 11:56 GMT

రాజ్ కోట్ వన్డేలో టీం ఇండియా భారీ పరుగులు సాధించింది. రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో ఆదుకున్నారు. కేఎల్ రాహుల్ 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ 112 పరుగులు చేయడంతోనే భారత్ ఈ పరుగులను సాధించగలిగింది.

రాహుల్ సెంచరీ...
ఈ మ్యాచ్ లో మరోసారి శుభమన్ గిల్ అర్ధ సెంచరీ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ అర్థ సెంచరీలు చేసిన శుభమన్ గిల్ ఈ మ్యాచ్ లో యాభై ఆరు పరుగులు చేశారు. మరో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, రవీంద్ర జడేజా 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్లార్క్ మూడు వికెట్లు తీశాడు. జెమిసన్, ఫోక్స్, లెనెక్స్, బ్రెస్ వెల్ లు తలో వికెట్ తీశారు. న్యూజిలాండ్ లక్ష్యం యాభై ఓవర్లలో 285 పరుగులు చేయాల్సి ఉంది.


Tags:    

Similar News