కార్ల్‌సన్‌కు మళ్లీ కోపం ఈసారి భారతీయుడే!!

ప్రపంచ నెంబర్ 1 చెస్ క్రీడాకారుడు, ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో ఓటమి పాలయ్యాడు.

Update: 2025-12-30 14:20 GMT

ప్రపంచ నెంబర్ 1 చెస్ క్రీడాకారుడు, ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. దోహా వేదికగా జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిజ్ ఛాంపియన్‌షిప్‌లో ఓటమి పాలైన అనంతరం తీవ్ర ఆవేశంతో టేబుల్‌ను కొట్టాడు. నార్వే చెస్ టోర్నీలో గుకేశ్‌ చేతిలో ఓడినప్పుడు కూడా కార్ల్‌సన్ ఇలాగే అసహనానికి గురయ్యాడు. అర్జున్ ఎరిగైసి నల్ల పావులతో ఆడాడు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. 9వ రౌండ్‌లో కార్ల్‌సన్‌పై విజయం సాధించిన అర్జున్, 10వ రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ నోడిర్‌బెక్ అబ్దుసతోరోవ్‌ను కూడా చిత్తు చేశాడు. 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో అర్జున్ ఎరిగైసి టోర్నీలో అగ్రస్థానంలో నిలిచాడు. అర్జున్ ఎరిగైసి తో పాటూ ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్ 9 పాయింట్లతో టాప్ లో ఉన్నాడు.

Tags:    

Similar News