India vs NewZealand : ఇక్కడ రికార్డులు భారత్ ను కలవరపెడుతున్నాయిగా?
భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే నేడు రాజ్ కోట్ లో జరగనుంది
భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే నేడు రాజ్ కోట్ లో జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వడోదరలో సూపర్ విక్టరీని కొట్టేసిన భారత్ రెండో వన్డేను కూడా గెలుచుకోవాలని శ్రమిస్తుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు బలంగా ఉన్నాయి. వడోదర మ్యాచ్ చూస్తే న్యూజిలాండ్ కూడా బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ సత్తా చూపింది. కానీ విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి వారు ఫామ్ లోకి రావడంతో భారత్ బలంగా ఉంది. బౌలింగ్ లోనూ హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తో పాటు సిరాజ్ కూడా మంచి బంతులు విసురుతున్నారు.
నాలుగు మ్యాచ్ లు ఆడితే...
రాజ్ కోట్ లో నిరంజన్ స్టేడియం గణాంకాలు చూస్తే మాత్రం భారత్ ను కలవర పెడుతున్నాయి. గతంలో ఉన్న రికార్డులు చూస్తే భారత్ కు ఇక్కడ విజయావకాశాలపై అనుమానాలున్నాయి. గత ఆరేళ్లలో భారత్ రాజ్ కోట్ లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. నాలుగు మ్యాచ్ లు ఆడితే మూడింటిలోగెలుపు సాధించలేదు. అదే కొంత భారత్ ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. అయితే ఇది క్రికెట్ కావడంతో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశాలున్నాయన్నది వాస్తవం. గెలుపోటములు రికార్డులను బట్టి ఉండవని, ఆరోజు ఎవరిది పై చేయి అవుతుందో వారిదే విజయం ఖాయమన్న విశ్లేషణలున్నాయి.
ఛేజింగ్ కష్టమే...
రాజ్ కోట్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. ఇక్కడ అత్యధిక పరుగులు ఏ జట్టయినా సాధిస్తుంది. ఛేజింగ్ లో ఈ స్టేడియం భారత్ కు అచ్చిరాలేదు. అందుకే టాస్ భారత్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. భారత్ ఈ స్టేడియంలో నాలుగు మ్యాచ్ లు ఆడగా ఒక్కదానిలోనూ గెలవలేదు. మరొకవైపు వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ కు గాయంతో దూరమయ్యాడు. దీంతో భారమంతా కులదీప్ యాదవ్, జడేజా, హర్షిత్ రాణా, సిరాజ్ లపైనే పడనుంది. ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు మాత్రమే గెలుపొందాయి. అందుకే ఈ మ్యాచ్ లో భారత్ కు టాస్ కీలకమని చెప్పాలి.
నేడు భోగి