India vs Newzealand : నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్.. ఇండోర్ లో కిక్కిచ్చే ఆట

భారత్ - న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే నేడు ఇండోర్ లో జరగనుంది

Update: 2026-01-18 04:31 GMT

భారత్ - న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే నేడు ఇండోర్ లో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ - న్యూజిలాండ్ లు చెరోరెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ లో సమంగా ఉన్నారు. ఇండోర్ లో జరిగే మ్యాచ్ సిరీస్ పై పై చేయి ఎవరిదో నిర్ణయిస్తుంది. వడోదర లో జరిగిన తొలి మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. రాజ్ కోట్ లో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో భారత్ పై విజయ కేతనం ఎగుర వేసింది. ఇరు జట్లు సిరీస్ 1-1 తో సమానంగా ఉండటంతో నేడు సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ జరగనుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

మంచి ఫామ్ లో ఉన్న
అయితే రెండు జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయి. ఒకరకంగా చూసుకుంటే ఇండోర్ లో జరిగే చివరి మ్యాచ్ మంచి కిక్కు నిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటర్లు నిలబడ్డారంటే ఇక క్రీజుకు అతుక్కుపోయినట్లే. వారు సెంచరీలతో పాటు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశారు. ఇక భారత బ్యాటర్లు కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరకూ మంచి ఫామ్ లో ఉన్నారు. జడేజా కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ చివర వరకూ మంచి ఫామ్ ను కొనసాగించే వారున్నారు. అందుకే ఇండోర్ లోనూ భారీ పరుగులు ఎవరైనా సాధించే అవకాశాలున్నాయి.
ఇక్కడా భారీ పరుగులేనా...
వడోధరలో న్యూజిలాండ్ 300 పరుగులు చేయగా, భారత్ ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించగలిగింది. అలాగే రాజ్ కోట్ లో అతి క్లిష్టమైన పిచ్ మీద భారత్ 285 పరుగులు చేయగా అలవోకగా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ ఛేజించగలిగింది. అంటే బ్యాటింగ్ లో రెండు జట్లు సత్తా చాటుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే భారత్ బౌలింగ్ పరంగా బలహీనంగా ఉందనే చెప్పాలి. బౌలింగ్ లో మార్పులు చేసుకుంటే విజయం సులువవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయగలిగేలా బంతులు విసిరగలిగితేనే భారత్ సిరీస్ పై పై చేయి సాధిస్తుంది. నేడు సండే మంచి కిక్కు ఇచ్చే మ్యాచ్ మాత్రం ఎవరూ మిస్ అవ్వకండి. టీ20ని తలపించేలా మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి.



Tags:    

Similar News