India vs NewZealand : తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం

వడోదరలో జరిగిన తొలి వన్డే లో భారత్ న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది.

Update: 2026-01-12 02:06 GMT

ఆరంభం అదిరింది. వడోదరలో జరిగిన తొలి వన్డే లో భారత్ న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ఆదివారం అందరినీ కట్టిపడేసింది. నాలుగు వికెట్ల తేడాతో మరో ఓవరు మిగిలి ఉండగానే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన 300 పరుగులు చేసింది. ఆ భారీ లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే టీం ఇండియా ఛేదించగలిగింది. విరాట్ కోహ్లి మరోసారి వీర విజృంభణ, శుభమన్ గిల్ అర్ధ సెంచరీతో విజయం సాధించింది. విరాట్ మరో ఏడు పరుగులుచేసి ఉంటే సెంచరీ పూర్తయ్యేది. పాపం...జస్ట్ మిస్. విరాట్‌ కోహ్లి 93 పరుగులతో మెరిసి, శుభ్‌మన్‌ గిల్‌ 56తో మద్దతివ్వడంతో న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

కోహ్లి ఔట్‌ తర్వాత...
మూడు వన్డేల సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లో 301 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 49 ఓవర్లలో 306 పరుగులకు చేరుకుంది.లక్ష్య ఛేదనలో భారత్‌ పూర్తి ఆధిపత్యం చూపిన వేళ 40వ ఓవర్లో కోహ్లి ఔట్‌ కావడం మ్యాచ్‌కు మలుపు. అప్పటికి భారత్‌కు 66 బంతుల్లో 67 పరుగులు అవసరం. వెంటనే రవీంద్ర జడేజా నాలుగు, శ్రేయాస్‌ అయ్యర్‌ నలభై తొమ్మిది, పెవిలియన్‌ చేరడంతో న్యూజిలాండ్‌కు అవకాశమొచ్చింది. అయితే కేఎల్‌ రాహుల్‌ 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో హర్షిత్‌ రాణాతో ఇరవై తొమ్మది పరుగులు చేసిసి కీలకంగా 37 పరుగులు జోడించారు. గాయంతో ఇబ్బంది పడుతున్న వాషింగ్టన్‌ సుందర్‌ ఏడుపరుగులతో వెనుదిరిగాడు. ఆఖర్లో కివీస్‌ ఆటగాళ్లు కొన్ని సులభ క్యాచ్‌లు వదలడం భారత్‌కు కలిసొచ్చింది.
శతకం చేజారి...
కైల్‌ జేమిసన్‌ 41 పరుగులకు నా నాలుగు వికెట్లతో న్యూజిలాండ్‌ను పోటీలో నిలిపాడు. మిడ్‌ఆన్‌లో కోహ్లిని క్యాచ్‌ చేయించి శతకం అంచున నిలిపాడు. జడేజా, అయ్యర్‌ను కూడా అవుట్‌ చేశాడు.శతకం చేజారినా, అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేసిన వేగవంతమైన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఈ ఘనతలో సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత రెండో స్థానంలోకి చేరి కుమార సంగక్కరను వెనక్కి నెట్టాడు.కోహ్లి–గిల్‌ జోడీ రెండో వికెట్‌కు 102 బంతుల్లో 118 పరుగులు జోడించింది. మధ్యలో 52 బంతుల పాటు బౌండరీ లేకపోయినా, గిల్‌ నేరుగా కొట్టి భారత్ నువిజయానికి దగ్గరగా చేర్చాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. డెవన్‌ కాన్వే 56, హెన్రీ నికోల్స్‌ 62 ఓపెనింగ్‌లో 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆపై హర్షిత్‌ రాణా రెండు, మహ్మద్ సిరాజ్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ రెండు, కులదీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. రెండో వన్డే బుధవారం రాజ్ కోట్ లో జరగనుంది.


Tags:    

Similar News