న్యూజిలాండ్ తో ఆడే భారత్ జట్టు ఇదే

న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.

Update: 2026-01-03 12:53 GMT

న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నారు. న్యూజిలాండ్ భారత్ పర్యటనలో భాగంగా మూడువన్డేలను ఆడనుంది. మొదటి వన్డే ఈ నెల 11న వడోదరలో జరగనుంది. రెండో వన్డే జనవరి 14న రాజ్ కోట్ లోనూ, మూడో వన్డే జనవరి 18న ఇండోర్ లో జరగనుంది.

ఈ జట్టుతో...
అయితే ఈ న్యూజిలాండ్ తో ఆడే భారత్ జట్టులో శుభమన్ గిల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రిసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్ దీప్ సింగ్, యశస్వి జైశ్వాల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. హార్ధిక్ పాండ్యా మాత్రం టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకు విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్)*, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు.
టీ 20 జట్లులో...
అలాగే న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కూడా భారత్ ఆడనుంది. ఈ జట్టును కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. అభిషేక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూశాంసన్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ర, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేసింది. భారత్ తో మొత్తం ఐదు టీ 20 న్యూజిలాండ్ ఆడనుంది. తొలి టీ20 జనవరి 21వ తేదీన నాగపూర్ లో జరగనుంది. రెండో టీ20 జనవరి 23న రాయ్ పూర్ లో జరగనుంది. మూడో టీ20 జనవరి 25న గౌహతిలోనూ, నాలుగో టీ20 జనవరి 28న విశాఖపట్నంలోనూ, ఐదో టీ 20 జనవరి 31న తిరువనంతపురంలో జరగనుంది.
Tags:    

Similar News