T20 World Cup : టీమిండియా ను గంభీర్ ప్రశాంతంగా ఉంచేటట్లు లేడుగా.. ప్రయోగాలు చేసే వేదికగా మార్చాడా?

అహ్మదాబాద్ లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ లో టీమిండియా చిత్తుగా ఓటమి పాలయింది.

Update: 2026-02-24 04:37 GMT

అహ్మదాబాద్ లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ లో టీమిండియా చిత్తుగా ఓటమి పాలయింది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 74 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికలపడింది. అయితే టీమ్‌మెనెజ్‌మెంట్ చేసిన కొన్ని తప్పిదాలు కూడా మెన్ ఇన్ బ్లూ ఓటమికి కారణమమ్యాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్‌ని ఆడించి భారత మెనెజ్‌మెంట్ ఘోర తప్పిదం చేసిందని నెటిజన్లు టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ పై ఫైర్ అవుతున్నారు. అక్షర్ పటేల్ కు అవకాశం ఇవ్వకుండా గంభీర్ తీసుకున్న నిర్ణయమే టీం ఇండియా కొంపముంచిందని అంటున్నారు.

అక్షర్ పటేల్ ను తప్పించి...
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అక్షర్‌కు నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అతడి స్దానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులో ఆడించారు. అయితే సఫారీలతో సూపర్-8 మ్యాచ్‌కు అక్షర్ తిరిగి అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ అక్షర్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది కేవలంవ్యూహాత్మక నిర్ణయం మాత్రమేని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా టాప్-5లో ముగ్గురు ఎడమచేతి బ్యాటర్లు ఉండడంతో, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కంటే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వుంటే బాగుంటుందని మేనేజ్‌మెంట్ భావించిందని అంటుున్నారు.
వాషింగ్టన్ వైఫల్యంతో...
కానీ మెనెజ్‌మెంట్ వ్యూహం బెడిసికొట్టింది. పవర్‌ప్లేలో సుందర్‌తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయింలేదు .కెప్టెన్ అతడిని ఏడో ఓవర్లో ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అలా అనీ నాలుగు ఓవర్ల కోటా కూడా పూర్తి చేయించలేదు. సుందర్ రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లో కూడా సుందర్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. 11 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో గంభీర్‌పై నెటిజన్లు ఫైరవతున్నారు. "కేవలం 'మ్యాచ్-అప్'ల కోసం ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను తప్పించడం ఎంతవరకు సమంజసం?" అని గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు. సెమీస్ కు వెళ్లాల్సిన తరుణంలో ఇటువంటి ప్రయోగాలు చేయడం గంభీర్ కు సరికాదని, అతని వల్లనే ఇటీవల తరచూ ఓటములు ఎదురవుతున్నా బీసీసీఐ పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News