India - South Africa : చివర వరకు మ్యాచ్ ఉత్కంఠ.. గెలుపు ఎవరిదన్నది అంచనా కష్టమే

భారత్ -దక్షిణాఫ్రికాల మధ్య సూపర్ 8 మ్యాచ్ రేపు జరగనుంది

Update: 2026-02-21 02:57 GMT

భారత్ -దక్షిణాఫ్రికాల మధ్య సూపర్ 8 మ్యాచ్ రేపు జరగనుంది. అయితే ఇరు జట్లు బలమైనవే. గెలుపు అనేది ఎవరికీ అంత సులువు కాదు. రెండు జట్లు గ్రూప్ స్టేజీలో నాలుగు మ్యాచ్ లో గెలిచి సూపర్ 8కు చేరుకున్నాయి. అంటే బలాబలాలు సమానమేనని అనుకోవాలి. టీ20 మ్యాచ్ లలో భారత్ వైపు గణాంకాలు మొగ్గు చూపుతున్నప్పటికీ దక్షిణాఫ్రికాను అంత తేలిగ్గా తీసిపారేయలేం. ఆ జట్టులో అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. అందులోభారత్ లోని మైదానాలకు వారు అలవాడు పడి ఉండటం కూడా కొంత సఫారీలకు సానుకూల అంశంగానే చూడాలి. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ దక్షిణాఫ్రికాను ఏ మాత్రం తీసిపారేయలేని జట్టు.

ఫుల్లు ఫామ్ లో ఉన్నా...
మరొకవైపు భారత్ జట్టు కూడా గ్రూప్ స్టేజీలో నాలుగు మ్యాచ్ లు గెలిచి సూపర్ 8 లోకి అడుగు పెట్టింది. అయితే జట్టులో సమన్వయ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అభిషేక్ శర్మ ఫామ్ లో లేకపోవడం ఒక రకంగా జట్టుకు భారమనే చెప్పాలి. మిగిలిన అందరూ ఫుల్లు ఫామ్ లో ఉన్నారు. పేసర్లు, స్పిన్నర్లు వికెట్లు సరైన సమయంలో తీయగలుగుతున్నారు. అయితే పాకిస్తాన్ పై కొంత సులువుగా విజయం సాధించిన టీం ఇండియా అమెరికా, నెదర్లాండ్స్ పై గెలిచేందుకు కొంత చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో ఒకింత ఆందోళన నెలకొంది. అభిషేక్ శర్మ కనుక పుంజుకుని ఆడితే మాత్రం భారత్ భారీ స్కోరు చేయగలిగే అవకాశముంది.
కొన్ని లోపాలు కూడా...
అలాగే ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యాలు కూడా జట్టుకు కరెక్ట్ సమయంలో అందివస్తున్నారు. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ తో రాణిస్తున్నాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ లు కూడా స్కోరు బోర్డు పరుగులు పెట్టించడంలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు గ్యారంటీ వికెట్లు తీస్తారన్న నమ్మకం ఉంది. కాకపోతే ఫీల్డింగ్ లో కొంత లోపాలు జట్టును దెబ్బతీస్తున్నాయని గత మ్యాచ్ లను చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే రెండు జట్లు బలమైనవే కావడంతో నిజంగా సండే నాడు జరిగే మ్యాచ్ మాత్రం టెన్షన్ మధ్య జరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ టీం ఇండియా సొంత మైదానంలో ఆడుతుండటంతో కొంత అడ్వాటేజీ అనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.


Tags:    

Similar News