Abhishek Sharma : శర్మా ఏందయ్యా.. ఇది.. నీ బ్యాట్ కు ఏమయింది బాసూ?
టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ వరల్డ్ కప్ కు ముందు చెలరేగి ఆడాడు
టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ వరల్డ్ కప్ కు ముందు చెలరేగి ఆడాడు. కానీ వరల్డ్ కప్ ప్రారంభమయిన నాటి నుంచి బ్యాట్ ను దించేశాడు. ఒక మ్యాచ్ లో జరిగితే పొరపాటు.. రెండో మ్యాచ్ లో జరిగితే.. గ్రహపాటు.. మూడో మ్యాచ్ లో రిపీట్ అయితే దానిని ఏమంటారు? అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై జరిగిన మూడు మ్యాచ్ లలో డకౌట్ అయి వెనుదిరగడం నిజంగా అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తుంది. పాకిస్తాన్ తో అంటే సరే... అమెరికా, నెదర్లాండ్స్ లోనూ అదే సీన్ కనిపించిందంటే.. అభిషేక్ అట్టర్ ఫెయిల్ కావడానికి కారణాలేంటన్న దానిపై క్రీడా వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది.
ఐదు ఓవర్లుంటే చాలని...
అభిషేక్ శర్మ ఐదు ఓవర్లు క్రీజ్ లో ఉంటే చాలు ఇక స్కోరు బోర్డు పరుగులు తీస్తుందని ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ భావిస్తాడు. నిజానికి అందులో వాస్తవముంది. అభిషేక్ శర్మ బ్యాట్ ఒకసారి పుంజుకుంటే మాత్రం ఇక అతనిని ఆపడం ఎవరి తరమూ కాదు. గతంలో అనేక మ్యాచ్ లలో ప్రత్యర్థులకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించారు. ప్రతి బంతిని సిక్సర్ గానో, బౌండరీకో మలిచే శక్తి, సామర్థ్యం అభిషేక్ శర్మలో ఉంది. తన వైపునకు దూసుకు వస్తున్న బంతిని ముందుగానే అంచనా వేసి బ్యాట్ తో ఒక ఆటాడుకోవడం అభిషేక్ దిట్ట. సింగిల్స్ తక్కువ. సిక్సర్లు, ఫోర్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ ప్రపంచంలోనే టీ20 ఆటగాళ్లలో మేటి ఆటగాడుగా అభిషేక్ శర్మ కు గుర్తింపు ఉంది.
వచ్చే రాగానే అవుటవుతూ...
అయితే వచ్చీ రాగానే అభిషేక్ శర్మ అవుట్ అవుతుండటంతో మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. కనీస పరుగులు చేయకుండా జీరోకు అవుట్ అవుతుండటంతో అభిషేక్ శర్మ పై ఫ్యాన్స్ కు నమ్మకం పోతుంది. మిగిలిన ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే వరల్డ్ కప్ లో టీం ఇండియాకు కొంత ఇబ్బందులు కలిగేవి. అప్పటికీ సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు మైదానంలో దిగిన వెంటనే దూకుడుగా ఆడకుండా కొన్ని బాల్స్ ను డిఫెన్స్ , సింగిల్స్ తీసి స్థిరపడిన తర్వాత బ్యాట్ ను ఝుళిపించవచ్చని చెప్పారు. ఏ పాటి బౌలర్ అయినా అవుట్ అవుతూ వికెట్లు ఇచ్చుకోవడం ఇప్పుడు టీం ఇండియాలోనే కాదు భారత క్రీడాలోకంలోనూ హాట్ టాపిక్ గా మారింది. మరి రానున్న సౌతాఫ్రికా, జింబాబ్వే వంటి మేటి జట్లపై అభిషేక్ ఎలా ఆడతాడో చూడాలి.