T20 World Cup : నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య సూపర్ 8 లో మ్యాచ్ జరగనుంది
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య సూపర్ 8 లో మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ దశలో రెండు జట్లు నాలుగు మ్యాచ్ లు గెలిచి మంచి జోరు మీదున్నాయి. అయితే అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు సానుకూలం కావడంతో ఎవరి వైపు విజయం మొగ్గుచూపుతుందన్నది చూడాలి.
ఇరు జట్లు మంచి పెర్ ఫార్మెన్స్...
ఇరు జట్లు మంచి పెర్ ఫార్మెన్స్ చూపిస్తుండటంతో పాటు ఇరు జట్లలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ కూడా బాగా ఉండటంతో చివరికి విజయం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎవరి ధీమా వారిలో ఉన్నారు. చివరిగా మైదానంలో ఎవరిది పై చేయి అవుతుందన్నది చూడాలి.