T20 World Cup : టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్
ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీకి చేరకుండానే టోర్నీ నుంచితప్పుకుంది
టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. ప్రపంచంలోనే మేటి జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీకి చేరకుండానే టోర్నీ నుంచితప్పుకుంది.జింబాబ్వే - ఐర్లండ్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో కంగారూలు ప్రపంచ కప్ నుంచి వైదొలిగార. వర్షం పడుతుండటంతో ఒక్క బంతి పడకుండా మ్యాచ్ ను అంపైర్లను రద్దు చేశారు. పదిహేడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీ నుంచి ప్రపంచ కప్ నుంచి తప్పుకున్నట్లయింది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో...
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో జింబాబ్వే, ఐర్లాండ్ కు చెరొక పాయింట్ లభించింది. దీంతో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ లు ఉన్నాయి. ఇప్పటికే శ్రీలంక సూపర్ 8 లోకి ప్రవేశించింది. ఒమన్ కూడా ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకుంది. జింబాబ్వే ఐదు పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా జట్టుకు మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ. ఆస్ట్రేలియా జింబాబ్వే, శ్రీలంకలపై ఓడిపోయి కేవలం రెండు పాయింట్లతోనే ఉంది.