T20 World Cup : నేడు భారత్ - నెదర్లాండ్ మ్యాచ్.. టీం ఇండియా జట్టు ఇదే

నేడు భారత్ - నెదర్లాండ్ మ్యాచ్ జరగనుంది.

Update: 2026-02-18 04:27 GMT

టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా మంచి ఊపు మీదుంది. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సూపర్ 8కు చేరుకుంది. అమెరికా, నమీబియా పై గెలిచిదంటే వాటిని పసికూనలని అంటారు. అంతకు మించి పాకిస్తాన్ పై కొలొంబోలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 61 పరుగులతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసి పాక్ ను మట్టికరిపించింది. దీంతో మూడు వరస విజయాలను నమోదు చేసుకుని జోరు మీదున్న టీం ఇండియా నేడు మరో మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది.

ఇప్పటికే సూపర్ 8కు చేరుకుని...
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు భారత్ - నెదర్లాండ్ మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది నామమాత్రపు మ్యాచ్. ఎందుకంటే ఇందులో ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సూపర్ 8కు చేరుకుంది. అయితే నెదర్లాండ్స్ కూడా మరో పసికూన. దీనిపై విజయం సాధించడం భారత్ కు అంత కష్టమేమీ కాదు. స్వల్ప మార్పులతో భారత్ జట్టు ఈ మ్యాచ్ లో తలపడే అవకాశముందని తెలుస్తోంది. అభిషేక్ శర్మను ఈ మ్యాచ్ లో ఆడించనున్నారు.
స్వల్ప మార్పులతో...
బ్యాటర్లలో పెద్దగా మార్పులుండకపోవచ్చు. అయితే బౌలర్లకు మాత్రం విశ్రాంతి ఇచ్చేందుకు కొందరిని ఈ మ్యాచ్ వరకూ దూరంగా ఉంచే అవకాశాలున్నాయి. ప్రధానంగా జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో అర్ష్ దీప్ సింగ్ ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్నినర్లలో కులదీప్ యాదవ్ ను కూడా పక్కన పెట్టి ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను బరిలోకి దించనున్నారు. ప్రయోగాలు పెద్దగా లేకపోయినా నెదర్లాండ్ పై మ్యాచ్ కావడంతో కొందరికి విశ్రాంతి నివ్వాలని జట్టు మేనేజ్ మెంట్ డిసైడ్ అయినట్లు సమాచారం.


Tags:    

Similar News