Asia Cup : ప్రాక్టీస్ లో టీం ఇండియా.. జెర్సీ లేకుండానే ఆసియా కప్ గెలుచుకునేందుకు శ్రమిస్తున్న జట్టు
ఆసియా కప్ కోసం దుబాయ్ చేరుకున్న టీమిండియా కఠోర సాధన చేస్తుంది
ఆసియా కప్ కోసం దుబాయ్ చేరుకున్న టీమిండియా కఠోర సాధన చేస్తుంది. భారత క్రికెట్ జట్టు శుక్రవారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ఫైనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. ఆసియా కప్ ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం సిద్ధమవుతున్న టీమిండియా ఈ నెల10వ తేదీన యూఏఈతో మొదటి మ్యాచ్, అనంతరం పాకిస్థాన్, ఒమాన్ జట్లతో తలపడనుంది. టీం ఇండియా జట్టు ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ డ్రాగా ముగించిన తర్వాత ఆటగాళ్లు కలసి సాధన చేసిన తొలి సెషన్ ఇదే కావడం విశేషం.
నేరుగా దుబాయ్ లోనే...
సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, సంజు సాంసన్, జితేష్ శర్మ, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ నెట్స్‌లో విస్తృతంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.టీం ఇండియాజట్టులో సీనియర్ ఆటగాళ్లు చాలామంది నెల రోజుల విరామం తర్వాత తిరిగి చేరారు. ఈ సారి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిబిరం ఏర్పాటు చేయకుండా, ముందుగానే దుబాయ్ చేరి వాతావరణానికి అలవాటు అయ్యేలా జట్టు మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంది.శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌లో టెస్ట్ జట్టును నడిపించిన తరువాత, ఫిట్ నెస్ డ్రిల్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
ఎనిమిది సార్లు టైటిల్ ...
జస్ప్రిత్ బుమ్రా తిరిగి టీ20ల్లోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. బుమ్రా చివరిసారి టీ20 మ్యాచ్ 2024 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఆడారు. ఆ మ్యాచ్‌లోఆ మ్యాచ్‌లో 2/18 వికెట్లు తీసి భారత్‌కు విజయాన్ని అందించారు. పదిహేను వికెట్ల తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. బుమ్రా 40 రోజుల విరామం తర్వాత తిరిగి జట్టులో చేరారు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మిస్ అవ్వడంతో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ జట్టు ప్రాక్టీస్ లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఆసియా కప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు టైటిల్ గెలిచింది.
భారత జట్టు ఆసియా కప్ షెడ్యూల్ ఇదే
ఇండియా vs యూఏఈ – సెప్టెంబర్ 10
ఇండియా vs పాకిస్థాన్ – సెప్టెంబర్ 14
ఇండియా vs ఒమాన్ – సెప్టెంబర్ 19