Tanmay Agarwal : వీర కొట్టుడు.. నాటు కొట్టుడు. తన్మయ్ ట్రిపుల్ సెంచరీ

రంజీ ట్రోఫీలో హైదరాబాదీ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు

Update: 2024-01-27 03:43 GMT

క్రికెట్ లో సెంచరీ చేయడమే కష‌్టం. డబుల్ సెంచరీ అంటే మరీ కష‌్టం. ఇక ట్రిపుల్ సెంచరీ అంటే అసలు చూడగలమా? వినగలమా? సాధ్యం కాని విషయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు మన హైదరాబాదీ కుర్రోడు తన్మయ్ అగర్వాల్. రంజీ ట్రోఫీలో ఏకంగా 323 పరుగులు చేసి రికార్డులను బ్రేక్ చేశాడు. మొన్నా మధ్య వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ చేసినప్పుడు కాళ్ల కండరాలు పట్టేసి ఇబ్బంది పడ్డాడు. కానీ తన్మయ్ ఏ మాత్రం అలసట చెందలేదు. ఇక చాలని అనుకోలేదు. పరుగులు చేస్తూనే ఉన్నాడు.

భారీ స్కోరు...
అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 172 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 529 పరుగులు చేసింది. అందులో తన్మయ్ చేసిన పరుగులు 323. అదులో 33 ఫోర్లు, 21 సిక్సర్లు. అంతలా మనోడు బాదుతుంటే.. అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లు నోరెళ్ల పెట్టక తప్పని పరిస్థిితి. తన్మయ్ తనకు వేసిన బౌలర్లను చీల్చి చెండాడారు. బంతి వెంట వారిని పరుగులు తీయిస్తూనే ఉన్నాడు.
ఓపెనర్ గా దిగి....
ఓపెనర్ గా దిగిన తన్మయ్ అగర్వాల్ ఈ రకమైన ఫీట్ చేయడం క్రికెట్ లో అత్యంత అరుదైన విషయం. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ లో ఈ అరుదైన ఘనతను అగర్వాల్ సాధించాడు. కెప్టెన్ రాహుల్ సింగ్ కూడా 185 పరుగులు చేసి కాస్తలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అనేక రికార్డులను సొంతం చేసుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనతను తన్మయ్ దక్కించుకున్నాడు. 119 బంతుల్లో డబుల్ సెంచరీ చేయడం కూడా రికార్డే. ఇందులో రవిశాస్త్రిది రెండో స్థానం. ఈ మ్యాచ్ లో అరుణాచల్ ప్రదేశ్ జట్టులో చామా మిలింద్, కార్తికేయలు తలో మూడు వికెట్లు పడగొట్టారు. మొత్తం మీద తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ క్రికెట్ చరిత్రలో అత్యద్భుతం.


Tags:    

Similar News