షాకింగ్.. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ పై తీవ్ర విమర్శలు

ముంబైలోని కోహ్లీ రెస్టారెంట్ ఊహించని వివాదంలో చిక్కుకుంది. విరాట్ కోహ్లీకి చెందిన

Update: 2023-12-04 08:40 GMT

ముంబైలోని కోహ్లీ రెస్టారెంట్ ఊహించని వివాదంలో చిక్కుకుంది. విరాట్ కోహ్లీకి చెందిన ప్రముఖ రెస్టారెంట్ వన్8 కమ్యూన్‌లోకి తనకు ప్రవేశం నిరాకరించారని ఓ వ్యక్తి చెబుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. తమిళనాడుకు చెందిన వ్యక్తి తెల్లటి చొక్కా, పంచె ధరించాడు. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ముంబైలోని కోహ్లీ రెస్టారెంట్ ముందే నిలబడి ఉన్నాడు.

జుహూ ఏరియాలోని ‘వన్ 8 కమ్యూన్’ రెస్టారెంట్ కు తమిళనాడుకు చెందిన యువకుడు ఒకరు వెళ్లారు. తమ సంప్రదాయం ప్రకారం తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించి వెళ్లడంతో రెస్టారెంట్ సిబ్బంది అతడిని ఆపేశారు. లోపలికి అనుమతించలేమని, వేరే రెస్టారెంట్ కు వెళ్లాలని సూచించారు. ఎందుకు అనుమతించరని అడిగితే వస్త్రధారణ తమ రూల్స్ కు అనుగుణంగా లేదన్నారని బాధితుడు చెప్పాడు. తన డ్రెస్సింగ్ హుందాగానే ఉందని, పైగా అది తమ సంప్రదాయమని చెప్పినా వినిపించుకోలేదన్నాడు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది తీరును నిరసిస్తూ అక్కడే ఓ వీడియో తీసి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడి సిబ్బంది తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమిళ సంప్రదాయ దుస్తులతో వచ్చిన వారిని అవమానించడం కరెక్ట్ కాదని నెటిజన్లు రెస్టారెంట్ సిబ్బందిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనకు విరాట్ బాధ్యత వహించరని.. ఆ సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది బాధ్యత వహించాలని నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై అక్కడ ఉన్న మేనేజర్‌కి తెలియజేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు, కానీ మీరు సోషల్ మీడియాలో ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదేమో అని కూడా స్పందిస్తున్నారు నెటిజన్లు.



Tags:    

Similar News