గూకేశ్ రాజును తీసుకుని విసిరేసి!!

చెక్‌మేట్‌ చెస్‌ ఈవెంట్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ హికరు నకముర చేసిన అతిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Update: 2025-10-06 10:45 GMT

చెక్‌మేట్‌ చెస్‌ ఈవెంట్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ హికరు నకముర చేసిన అతిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుకేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నకముర గుకేశ్‌ రాజును తీసి ప్రేక్షకుల్లోకి విసిరేశాడు. గుకేశ్‌ రాజును నకముర విసిరేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నకముర ప్రవర్తన హుందాగా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చెక్‌మేట్‌ చెస్‌ ఈవెంట్లో భారత్‌ 0-5తో అమెరికా చేతిలో ఓడింది. అంతకు ముందే నలుగురు భారత ఆటగాళ్లు ఓటములు మూటగట్టుకోగా.. చివరిదైన అయిదో గేమ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ హికరు నకముర చేతిలో ఓటమి పాలయ్యాడు. గుకేశ్‌పై నెగ్గి అమెరికాకు 5-0తో ఘన విజయాన్ని అందించాడు.

Tags:    

Similar News