పాక్ తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్.. ఏమన్నాడంటే

Update: 2022-10-22 04:34 GMT

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. కీలకమైన ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకే సెమీస్ కు వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక గత టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తూ ఉంది. ఇక మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.

టోర్నమెంట్ కు అంత ముందుగా ఆస్ట్రేలియాకు వెళ్లడంపై రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. ఇలాంటి పెద్ద టోర్నమెంట్స్ కు సంబంధించిన పర్యటనలలో ఉన్నప్పుడు.. బాగా సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని.. చాలా మంది విదేశీ పరిస్థితుల్లో ఆడటం అలవాటు చేసుకోరు.. వాళ్లకు తెలియడానికే ఇలా ముందుగా ఆస్ట్రేలియాకు వచ్చేశాం. BCCI, టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం, మేము మా సామర్థ్యం మేరకు సిద్ధంగా ఉండాలనుకుంటున్నాము. ముందుగా ఆస్ట్రేలియాకు వెళ్లడానికే నిర్ణయం తీసుకున్నామని రోహిత్ చెప్పాడు. ఇక మ్యాచ్ కు వర్షం ముప్పు ఉండడంపై కూడా రోహిత్ మాట్లాడాడు. 'మెల్బోర్న్ లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. రేపు ఏమి జరుగుతుందో మీకు నిజంగా తెలియదు. 40 ఓవర్ల ఆట అని భావించి ఇక్కడికి రావాలి, కానీ మ్యాచ్ ను తక్కువ ఓవర్లకి కుదిస్తే మాత్రం అందుకు మేము సిద్ధంగా ఉంటాము' అని రోహిత్ చెప్పాడు. "ఒత్తిడి అనే ఈ పదాన్ని నేను ఉపయోగించకూడదనుకుంటున్నాను, పాకిస్తాన్ ఎప్పుడూ మంచి జట్టు. ఆ రోజుకు, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడితే మ్యాచ్ లను గెలుస్తాం" అని రోహిత్ చెప్పాడు. ఇక తాము ప్రస్తుత టోర్నమెంట్ గురించి ఆలోచిస్తున్నామని.. 2023 ఆసియా కప్ గురించి ఆలోచించడం లేదని తెలిపాడు.


Tags:    

Similar News