సూర్య ఇక అవుట్

వన్డేలో టీం ఇండియా ఓటమితో సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది

Update: 2023-03-23 05:08 GMT

వన్డేలో టీం ఇండియా ఓటమితో సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ వరసగా డకౌట్లు కావడంతో వన్డేల నుంచి ఇక సూర్యను తప్పించే అవకవాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జవనవరిలో సెంచరీ చేయడంతో ఆసిస్ తో తలపడే వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ కు టీం ఇండియా మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. వరసగా గోల్డెన్ డకౌట్ కావడంతో సూర్యను వన్డేల్లో తప్పించమని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

వరస వైఫల్యాలతో...
కనీసం కాసేపు క్రీజ్ లు నిలబడలేని సూర్యకుమార్ యాదవ్ ను వన్డేలకు దూరంగా ఉంచాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి. వరసగా రెండు మ్యాచ్ లు డకౌట్ అయినా చెన్నైలో జరిగిన మ్యాచ్ లో మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది. ఈ అవకాశాన్ని కూడా సూర్య సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి బంతి ఎదుర్కొనలేక వికెట్లను అప్పగించి కళ్లప్పగించి చూస్తుండి పోయాడు. అగర్ బౌలింగ్ లో అవుటైన సూర్యకుమార్ ను ఇక వన్డే లో తీసుకోవడం కష్టమేనని అంటున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలు కావడంతో సిరీస్ ను కూడా చేజార్చుకుంది. విరాట్ కొహ్లి అర్థ సెంచరీ, హార్థిక్ పాండ్యా, కేఎల్, రాహుల్, రోహిత్ శర్మ ఆశించిన పరుగులు సాధించినా సూర్య విఫలంతోనే మ్యాచ్ చేజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News