Asia Cup : భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు చేయాలంటూ పిటిషన్‌

ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2025-09-11 07:39 GMT

ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యున్నత న్యాయస్థానం పై విధంగా స్పందించింది. ‘అంత అత్యవసరం ఏమిటి? అది కేవలం ఒక మ్యాచ్‌. అలా జరగనివ్వండి. మ్యాచ్‌ ఆదివారం ఉంది. ఏం చేయాలి?’ అని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది.

ఆగ్రహించిన సుప్రీం...
ఆదివారం మ్యాచ్‌ ఉందని, శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్‌ నిష్ఫలమవుతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. భారత్ - పాక్ మ్యాచ్ లు జరిగితే తిరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని పిటీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 14న జరిగే భారత్ - పాక్ మ్యాచ్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం దానిపై విచారణను వాయిదా వేసింది.


Tags:    

Similar News