IPL 2025 : నేడు ఐపీఎల్ లో మ్యాచ్ అదుర్స్
నేడు ముంబయి ఇండియన్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడుతుంది
ఐపీఎల్ సీజన్ ఇప్పటికే సగం ముగిసింది. ఇప్పటి వరకూ అనేక జట్లు మ్యాచ్ లు గెలిచి ముందుడగా, మరికొన్ని జట్లు మాత్రం పాయింట్ టేబుల్ లో చివరలో ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా కొన్ని జట్లకు ఓటములు తప్ప విజయాలను దక్కడం లేదు. ఈ సమయంలో ఎవరు గెలుస్తారన్నది చివర వరకూ ఉత్కంఠగా మారనుంది. నాలుగేళ్ల తర్వాత నిన్న ఐపీఎల్ లో తొలిసారి సూపర్ ఓవర్ ను కూడా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో రానున్న మ్యాచ్ లన్నీ క్రికెట్ ఫ్యాన్స్ అన్నీ అలరించనున్నాయి.
నేడు ముంబయిలో...
ఈరోజు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరగనుంది. నేడు ముంబయి ఇండియన్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడుతుంది. ముంబయి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లు ఆడి రెండింటిలో గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అలాగే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కూడా ఆరు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లలో గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అంటే రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయని చెప్పకతప్పదు. ఈ మ్యాచ్ అభిమానులకు టెన్షన్ పెడుతుందనడంలో సందేహం లేదు.