IPL 2025 : నేడు లక్నో vs హైదరాబాద్
లక్నో సూపర్ జెయింట్స్ తో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది
ఐపీఎల్ మ్యాచ్ లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్ రేసుకు చేరుకున్నాయి. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్ కు చేరుకున్నట్లయింది. ఇక మిగిలింది నాలుగో స్థానం మాత్రమే. నాలుగో స్థానం కోసం ముంబయి ఇండియన్స్ తో పాటు ఢిల్లీ కాపిటల్స్ జట్టు పోరాడాల్సి ఉంటుంది.
నామమాత్రపు మ్యాచ్
అయితే నేడు ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ నామమాత్రమేనని చెప్పాలి. లక్నో సూపర్ జెయింట్స్ తో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు ఏది గెలిచినా ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశం లేదు. హైదరాబాద్ సన్ రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా పదకొండుమ్యాచ్ లు ఆడి కేవలం పది పాయింట్లు మాత్రమే ఉంది. కాబట్టి రెండు జట్లు ఏది గెలిచినా ప్రయోజనం లేని మ్యాచ్ ఇది.