IPL 2025 : నేడు ఐపీఎల్ లో చెన్నై vs హైదరాబాద్
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢీకొంటుంది
ఐపీఎల్ సీజన్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే ముఖ్యమైన మ్యాచ్ లు ముగిశాయి. దీంతో దాదాపు ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు ఇంకా కొంత అవకాశం మాత్రమే ఉంది. కేవలం నాలుగు జట్లకు మాత్రమే ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశముండటంతో అందుకోసం పోటీ పడుతున్నాయి. ఢిల్లీ కాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తో పాటు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు కూడా రేసులో ఉన్నాయి. మరి చివరకు ఏ జట్టు చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు జట్లు చిట్ట చివర...
అయితే నేడు ఐపీఎల్ లో మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు ఓడినా, గెలిచినా లాభమూ లేదు. నష్టమూ లేదు. రెండు జట్లు అత్యంత పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢీకొంటుంది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఎనిమిది మ్యాచ్ లు ఇప్పటి వరకూ ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి ఆరింటిలో ఓడిపోయి చివరి స్థానంలో ఉన్నాయి. దీంతో చివరి స్థానంలో ఉన్న జట్లు నేడు పోటీ పడుతున్నాయి.