క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ బౌల‌ర్‌

ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ అన్ని ఫార్మ‌ట్‌ల‌ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు.

Update: 2023-08-14 12:46 GMT

ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ అన్ని ఫార్మ‌ట్‌ల‌ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఫిన్‌ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. నేను గత 12 నెలలుగా నా శ‌రీరంతో పోరాడుతున్నాను. ఓటమిని అంగీకరించాను" అని 34 ఏళ్ల ఫిన్ రిటైర్మెంట్‌ ప్రకటనలో పేర్కొన్నాడు. "క్రికెట్ ఆడగలిగినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను 2005లో మిడిల్‌సెక్స్‌కు అరంగేట్రం చేసినప్పటి నుండి నా ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగలేదు.. అయినప్పటికీ నేను ఈ జ‌ర్నీని ఇష్టపడతాన‌ని పేర్కోన్నాడు.

2010లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫిన్.. 36 టెస్టులు, 69 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. 2010-11 పురుషుల యాషెస్‌లో ఇంగ్లాండ్ విజయంలో 14 వికెట్లు తీశాడు. 2015 యాషెస్‌లో 12 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో 125, వన్డేల్లో 102, టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఎక్కువ కాం దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడిన ఫిన్‌.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 570 వికెట్లతో అదరగొట్టాడు. స్టీవెన్‌ ఫిన్ ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్సు ప్రారంభించాడు. రేడియో, టెలివిజన్‌లో పండిట్‌గా కెరీర్ మొద‌లుపెట్టాడు. ఈ మ‌ధ్య‌కాలంలో యూకేలోని అనేక ప్రధాన ప్రసారకర్తలతో కలిసి పనిచేశాడు.


Tags:    

Similar News