SRH: సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ వచ్చేశాడు

IPL 2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు

Update: 2024-03-04 06:54 GMT

IPL 2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. స్టార్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కమ్మిన్స్ ఇకపై ఐడెన్ మార్క్రామ్ స్థానంలో కెప్టెన్ గా నియమితుడయ్యాడు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచింది. ఈసారి ఎలాగైనా టైటిల్ ను అందుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది. అందుకే వేలంలో స్టార్స్ ను కొనడానికి సన్ రైజర్స్ ఆసక్తి చూపించింది. వేలంలో 20.50 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన కమ్మిన్స్ కెప్టెన్‌గా ఉంటే మంచిదని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. డానియల్ వెట్టోరి, SRH కొత్త ప్రధాన కోచ్ గా ఉన్నాడు. డేల్ స్టెయిన్‌కు (ఖాళీగా ఉన్న బౌలింగ్ కోచ్ పాత్రకు) ప్రత్యామ్నాయాన్ని కనుగొనే పనిలో ఉన్న వెట్టోరి, కోచింగ్ సెటప్‌లోకి జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను తీసుకున్నాడు.

మార్క్రామ్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను SA20లో బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్‌కు అందించినప్పటికీ.. 2023లో SRH పేలవమైన ప్రదర్శన చేసింది. అందుకే నాయకత్వంలో మార్పు తీసుకుని వచ్చింది. కమిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా గత ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ODI ప్రపంచకప్‌లో కూడా ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కమిన్స్ వ్యవహరించడం ఇదే తొలిసారి. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. బంతితో పెద్దగా విజయం సాధించనప్పటికీ, కమిన్స్ 14 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.


Tags:    

Similar News