ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ హైదరాబాద్ ఓటమి

ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య గత రాత్రి ముగిసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్

Update: 2022-05-23 03:00 GMT

ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య గత రాత్రి ముగిసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌ మొదటి ఇన్నింగ్స్ లో 157 పరుగులు మాత్రమే చేయగా.. పంజాబ్ 29 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. లియామ్ లివింగ్ స్టోన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 (నాటౌట్) పరుగులు చేసి మాంచి ఫినిషింగ్ ఇచ్చాడు. మిగిలిన ఆటగాళ్లలో బెయిర్‌స్టో 23, శిఖర్ ధావన్ 39, షారూఖ్ ఖాన్ 19, జితేష్ శర్మ 19 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్లాక్ ఫరూకీ రెండు వికెట్లు తీసుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. హైదరాబాద్ బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టుకోవడంలో విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 43, రొమారియా షెపర్డ్ 26 (నాటౌట్), వాషింగ్టన్ సుందర్ 25, అయిడెన్ మార్ క్రమ్ 21, రాహుల్ త్రిపాఠి 20 పరుగులు సాధించారు. ఓపెనర్ ప్రియమ్ గార్గ్ (4), నికోలాస్ పూరన్ (5) విఫలమయ్యారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్ చెరో మూడు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను కట్టడి చేశారు. కగిసో రబాడాకు ఓ వికెట్ దక్కింది. మూడు కీలక వికెట్లు పడగొట్టిన హర్‌ప్రీత్ బ్రార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ ఏడు విజయాలు, 14 పాయింట్లతో ఆరో స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది. హైదరాబాద్ 6 విజయాలు, 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది.
24న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. 25న లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్ లో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. 27న రెండో క్వాలిఫయర్ జరుగుతుంది. ఈ నెల 29న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.


Tags:    

Similar News