India Vs South Africa : ఘోరమైన ఓటమి.. వేళ్లన్నీ అతని వైపేనా?

గౌహతిలో దక్షిణాఫ్రికా భారత జట్టుపై అద్భుతమైన విజయం సాధించింది.

Update: 2025-11-27 02:11 GMT

భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఘోరమైన పరాభవం. గౌహతిలో దక్షిణాఫ్రికా భారత జట్టుపై అద్భుతమైన విజయం సాధించింది. ఇంతటి చెత్త ప్రదర్శన కొన్ని దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడలేదు. సొంత గడ్డపై ఇప్పటికే రెండు సిరీస్ ను కోల్పోయిన భారత జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని కఠిన నిర్ణయాలను బీసీసీఐ తీసుకోవాల్సి ఉంది. నిర్దాక్షిణ్యంగా కొందరిని పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఎవరిది తప్పు అనేకంటే సమిష్టిగా అందరి వైపు వేళ్లు చూపించినా దీనికి ప్రధాన కారణం మాత్రం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వహించాల్సి ఉంటుంది. భారత గడ్డపై దక్షిణాఫ్రికా వైట్ వాష్ చేసింది.

కోచ్ పైనే అందరి వేళ్లు...
ఎందుకంటే ఎవరు కోచ్ గా ఉన్న సమయంలో భారత్ ఇంత ఘోరమైన ఓటమిని చవి చూడలేదు. ఆటగాళ్లను సరైన విధంగా మోటివేట్ చేయడంలోనూ, వారిలో కనీస స్ఫూర్తిని నింపడంలో గౌతమ్ గంభీర్ ఘోరంగా విఫలమయ్యాడన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. తొలి టెస్ట్ లో 30 పరుగులతో ఓటమి పాలయిన భారత్, రెండో టెస్ట్ లో 408 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో భారత క్రికెట్ అభిమానుల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అత్యధిక పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
వరసగా ఓటములు...
ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ సిరీస్ కోల్పోయిన భారత జట్టు...గతంలో న్యూజిలాండ్ పై సొంత గడ్డపై సిరీస్ కోల్పోయిన గురైన టీం ఇండియా తర్వాత దక్షిణాఫ్రికాపై కూడా ఓటమి పాలు కావడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత హీనమైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఇంత ఘోరమైన ఓటమిని టీం ఇండియా ఎదుర్కొనలేదు. 140 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయిందంటే ఏ స్థాయిలో టీం ఇండియా ఆట సాగిందన్నది అర్థమవుతుందని అనుకోవాలి. దీనికి ఖచ్చితంగా మూల్యం ఎవరో ఒకరు చెల్లించుకుని తీరాలని, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News