India vs South Africa : సొంత గడ్డపై ఘోర అవమానం.. చెత్త బ్యాటింగ్
కోల్ కత్తా లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ సౌతాఫ్రికాపై దారుణంగా ఓటమి పాలయింది.
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరువవ్వాలన్న భారత్ కల ఫలించేలటట్లు లేదు. చెత్త బ్యాటింగ్ తో మనోళ్లు సమర్పించుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టీం ఇండియా సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా స్పిన్నర్ల దెబ్బకు భారత్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. ఏ స్పిన్నర్ల అయితే తమను అనేక సార్లు గెలిపించారో... అదే స్పిన్నర్ల ధాటికి గిలగిల కొట్టుకున్నారు. కోల్ కత్తా లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ సౌతాఫ్రికాపై దారుణంగా ఓటమి పాలయింది. బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడమే ఈ ఓటమికి ప్రధాన కారణం. అతి తక్కువ పరుగులును కూడా చేయలేక చతికిల పడింది. ఇంతటి ఘోర మైన అపజయాన్ని భారత్ ఆటగాళ్లు మూటగట్టుకున్నారు.
30 పరుగుల తేడాతో...
ఆఫ్‌స్పిన్నర్ సైమన్ హార్మర్ చెలరేగడంతో భారత్‌పై దక్షిణాఫ్రికా ముప్ఫయి పరుగుల తేడాతో గెలిచింది. ఇక్కడ ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో విజయం సాధించిన ఆఫ్రికా, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది. రెండో టెస్ట్ గువాహటిలో నవంబర్ 22 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇది భారత్‌లో ఆఫ్రికా జట్టుకు 15 ఏళ్ల తర్వాత వచ్చిన తొలి టెస్ట్ విజయం. 124 పరుగుల లక్ష్యంతో మూడో రోజున బ్యాటింగ్‌కి దిగిన భారత్ 93 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ మొత్తం దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ధాటికి చెల్లా చెదురైయింది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా ఇక మ్యాచ్‌లో పాల్గొనలేరని జట్టు ప్రకటించింది.
స్పిన్నర్ల ధాటికి...
దక్షిణాఫ్రికా స్పిన్నర్ హార్మర్ నాలుగు వికెట్ల తీసి భారత బ్యాటింగ్‌ను ధ్వంసం చేశాడు. జాన్సన్ రెండు వికెట్లు తీసి సహకరించాడు. వాషింగ్టన్ సుందర్ 92 బంతుల్లో 31 పరుగులు చేసి ఆపుకోబోయినప్పటికీ ఫలితం దక్కలేదు. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై జట్టు ప్రతిస్పందన బలహీనంగా నిలిచింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ 153 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 189 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ కాకాగా రెండో ఇన్నింగ్స్ కు వచ్చేసరికి 93 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి చేష్టలుడిగి చూసింది. రెండో ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్ ఒక్కడే 31 పరుగులు చేయగలిగాడు. ఇకనైనా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుంటే భారత్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవడమూ కష్టమే