క్షమించండి: రిషబ్ పంత్

సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌‌‌‌లో 0–2తో వైట్‌‌‌‌వాష్‌‌‌‌ అవడంపై ఇండియా టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణ చెప్పాడు.

Update: 2025-11-28 14:37 GMT

సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌‌‌‌లో 0–2తో వైట్‌‌‌‌వాష్‌‌‌‌ అవడంపై ఇండియా టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణ చెప్పాడు. ఈ ఘోర పరాజయం నుంచి కోలుకుని తమ జట్టు బలంగా తిరిగొస్తుందని మాట ఇచ్చాడు. మెడ గాయంతో శుభ్‌‌‌‌మన్ గిల్‌‌‌‌ రెండో టెస్టుకు దూరంగా ఉండటంతో పంత్‌‌‌‌ స్టాండిన్ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించాడు. తొలిసారి పంత్ నాయకత్వంలో బరిలోకి దిగిన జట్టు 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. క్రికెట్ సవాళ్లను అధిగమించి జట్టుగా, వ్యక్తులుగా ఎదిగేలా మాకు పాఠాలు నేర్పిస్తుంది, ఈ టీమ్ సత్తా ఏంటో మాకు తెలుసు. మరింత కష్టపడతాం.. మా లక్ష్యంపై ఫోకస్ పెట్టి జట్టుగా, వ్యక్తులుగా మరింత బలంగా, మెరుగ్గా తిరిగొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎక్స్ వేదికగా పంత్ తెలిపాడు.

Tags:    

Similar News